భారతదేశం, సెప్టెంబర్ 1 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే సెప్టెంబర్ 1వ తేదీ ఎపిసోడ్ లో నేనేదో అందరితో సరదాగా ఉంటే ఇది తప్పు పడుతుందిరా అని దాసుతో అంటుంది పారిజాతం. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలమ్మా అని దాసు అంటాడు. పది మందితో కలిసి నవ్వుతూ ఉండటమే రా జీవితమంటే అని పారు అంటే జ్యోత్స్న షాక్ అయి చూస్తుంది. నువ్వు శివన్నారాయణ పక్కన కూర్చోవడం బాగుందిరా, చాలా హ్యాపీ అని పారిజాతం అంటుంది.

మా అమ్మ మారింది మరి నువ్వెప్పుడు మారతావని జ్యోత్స్నను అడుగుతాడు దాసు. నువ్వు పెళ్లికి రావొద్దన్నావు, సత్యనారాయణ స్వామి వ్రతానికి కాదు. ఇక్కడికి రమ్మని కార్తీక్ చెప్పాడు. పెళ్లిలో తాళి కనిపించలేదని విన్నా. అది నీ పనేనా. సుమిత్ర ఎందుకు రాలేదు. దీప దారికి అడ్డు రావొద్దు. శివన్నారాయణ మనవరాలు దీపే అన్న విషయం ఏ రోజు బయటపడుతుందో తెలియదు. అప్పటివరకూ ఆ హోదాలో ఉండు. కానీ నిజాన...