భారతదేశం, అక్టోబర్ 10 -- కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 10వ తేదీ ఎపిసోడ్ లో కంపెనీని నష్టాల్లో నుంచి బయటపడేసేందుకు సీఈఓగా ఓ నిర్ణయం తీసుకున్నానని జ్యోత్స్న అంటుంది. కానీ 50 పర్సెంట్ షేర్ మాది అని, షేర్స్ అమ్మేస్తున్నామని మిగతా ముగ్గురు బోర్డు మెంబర్స్ షాక్ ఇస్తారు. అప్పుడే వైరా ఎంట్రీ ఇస్తాడు. బయట కార్తీక్ ను చూసి లోపలికి వస్తాడు. మామయ్య ఎనిమి ఎందుకు వచ్చాడని కార్తీక్ అనుకుంటాడు.

వైరా లోపలికి రాగానే దశరథ, శివన్నారాయణ షాక్ అవుతారు. వీళ్ల పేరున ఉన్న 50 పర్సెంట్ షేర్స్ కొంటున్నానని వైరా చెప్తాడు. దీన్ని మోసం అంటారని శివన్నారాయణ అంటాడు. ఎవరి చేతిల్లో ఎవరు ఓడిపోయారో తెలిసిందే, మేం ఎవరికీ భయపడమని జ్యోత్స్న అంటుంది. మేనేజర్ వచ్చి కంపెనీ వేరే వాళ్ల చేతికి వెళ్లిపోతుందని చెప్తే, కార్తీక్ ఓ స్లిప్ రాసి తాతకు ఇవ్వమంటాడు. ఆ స్లిప్ చూసి కార్తీక్ ను రమ్...