భారతదేశం, నవంబర్ 26 -- కార్తీక దీపం 2 టుడే నవంబర్ 26 ఎపిసోడ్ లో దీప బిడ్డ ఓ గొప్పింటి బిడ్డగానే ఈ అంతపురంలో అడుగుపెడుతుంది. ఇది భవిష్యవాణి. దీన్ని ఎవరూ ఆపలేరమ్మా. రాతను ఎవరూ మార్చలేరు. మార్చాలని నీ చేతులు ప్రయత్నిస్తే నీ తలరాతను నేను మారుస్తానని జ్యోత్స్నకు దాసు వార్నింగ్ ఇస్తాడు.

దీపకే కాదు కడుపులో బిడ్డకు అన్యాయం చేయాలని చూసినా పిలవగానే ఆ దేవుడు ప్రత్యక్షమవుతాడో లేదో తెలియదు కానీ నేను మాత్రం ప్రత్యక్షమవుతా. నేను ముఖ్యమైన పని మీద వెళ్తున్నా. ఎప్పుడు వస్తానో తెలియదు. కానీ నువ్వు తప్పు చేస్తే మాత్రం కచ్చితంగా వస్తాను. నువ్వు అన్నింటికి సిద్ధంగా ఉండు. నువ్వు నా కూతురు అని తెలిసే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పి దాసు వెళ్లిపోతాడు.

ఇప్పుడు కన్సీవ్ అయ్యావని తెలిసినప్పటి నుంచే మందులు వాడాలి. నెలకోసారి టెస్టు చేయించుకోవాలి. కనీసం రోజుకు 8 గంటలు ని...