భారతదేశం, అక్టోబర్ 7 -- కార్తీక దీపం 2 టుడే అక్టోబర్ 7వ తేదీ ఎపిసోడ్ లో అగ్రిమెంట్ పేపర్లు తీసుకుని కార్తీక్ ను వెళ్లిపొమ్మంటాడు శివన్నారాయణ. మెడ పట్టుకుని బయటకు గెంటేయాలని జ్యోత్స్న అనగానే నోర్ముయ్ అని గట్టిగా అరుస్తాడు శివన్నారాయణ. ఈ మాట అనే అర్హత ఉందా నీకు? నాకున్న కోపానికి నిన్ను కొట్టకుండా ఉండటానికి నా వల్ల కావట్లేదు. నువ్వు అసలు మనిషివేనా? నీకు బుద్ధి ఉందా? అని శివన్నారాయణ ఫైర్ అవుతాడు.

వేలం పాటను ఆపి మనకు నష్టం తీసుకొచ్చిన కార్తీక్ ను తిట్టకుండా జ్యోత్స్నను అంటారేంటీ అని సుమిత్ర అడుగుతుంది. ఎవరు నష్టం రాకుండా ఆపారో అందరికీ తెలిసేలా చేయమని దశరథకు చెప్తాడు శివన్నారాయణ. వైరాకు కాల్ చేస్తాడు దశరథ. రూ.10 కోట్ల విలువైన ప్రాపర్టీని రూ.20 కోట్ల వరకూ పాడేలా చేశావు. నేను ఆపేద్దామనుకునే టైమ్ లో నువ్వు నీ కూతురితో ఆపించి దెబ్బ కొట్టావని వైరా ...