భారతదేశం, డిసెంబర్ 12 -- కార్తీక దీపం 2 టుడే డిసెంబర్ 12వ ఎపిసోడ్ లో శౌర్యకు మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయని కాంచన, అనసూయ అడుగుతారు. శౌర్య కౌంటర్లు కామెడీగా ఉంటాయి. నువ్వు కలెక్టర్ అవాలని మీ అమ్మ కోరుకుంటుందని శౌర్యతో కాంచన అంటుంది. అయిపోతాను నానమ్మ, ఈ రోజు అయిపోమంటావా? అని శౌర్య అంటుంది. చదువు పేరుతో శౌర్య డ్రాయింగ్ చేస్తుంటే చూసి అనసూయ పట్టుకోవాలని చూస్తుంది, కానీ దొరకదు.

కాంచన ఇంటికి వచ్చిన కావేరి.. శౌర్యను పట్టుకుంటుంది. ఈ టైమ్ లో వచ్చావేంటీ? అని కాంచన అడుగుతుంది. ఈ ఇంట్లో పని ఉండి వచ్చా. అమ్మ కడుపులో బేబీని చూద్దామని వచ్చానని కావేరి చెప్తుంది. కడుపుతో ఉన్న కోడలికి అత్త వరసయ్యే వాళ్లు వండిపెట్టడం ఆనవాయితీ. కార్తీక్, దీపను రేప్పొద్దున టిఫిన్ కు తీసుకెళ్దామని అడిగేందుకు వచ్చా. వాళ్లతో పాటు అని కావేరి అంటుండగానే, ఇద్దరు వస్తారని మాట కట్...