భారతదేశం, ఏప్రిల్ 25 -- ద‌శ‌ర‌థ్‌ను గ‌న్‌తో షూట్ చేసిన కేసులో దీప‌కు బెయిల్ దొర‌క‌దు. ఆమెకు జ‌డ్జ్ రిమాండ్ విధిస్తుంది. పోలీసులు దీప‌ను జైలులో పెడ‌తారు. త‌న ప‌రిస్థితిని త‌ల‌చుకొని దీప క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. ద‌శ‌ర‌థ్‌ను హాస్పిట‌ల్ నుంచి డాక్ట‌ర్లు డిశ్చార్జ్ చేస్తారు. భ‌ర్త‌కు హార‌తి ఇచ్చి ఇంట్లోకి తీసుకొస్తుంది సుమిత్ర‌.

కుటుంబ స‌భ్యుల‌ను చూడ‌గానే...మిమ్మ‌ల్ని మ‌ళ్లీ చూస్తాన‌ని అనుకోలేద‌ని ద‌శ‌ర‌థ్ ఎమోష‌న‌ల్ అవుతాడు. చెల్లికి ఈ విష‌యం తెలుసా అని శివ‌న్నారాయ‌ణ‌ను అడుగుతాడు ద‌శ‌ర‌థ్‌. నువ్వు క్షేమంగా తిరిగి వ‌చ్చావ‌న్న‌ది మాకు సంతోషాన్ని క‌లిగించే విష‌య‌మే కానీ వాళ్ల‌కు కాద‌ని శివ‌న్నారాయ‌ణ అంటాడు.

ఇంత జ‌రిగిన నీకు చెల్లెలు గుర్తొచ్చింది. కానీ చెల్లెలికి నువ్వు గుర్తులేవు. అన్న‌య్య బ‌తికున్నాడో...చ‌చ్చిపోయాడా దానికి అవ‌న‌స‌రం అని కోప...