భారతదేశం, ఏప్రిల్ 29 -- కార్తీక దీపం 2 సీరియల్ నేటి ఏప్రిల్ 29వ తేదీ ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. తనకు శిక్ష పడడం ఖాయమని శౌర్యను జాగ్రత్తగా చూసుకోవాలని అనసూయకు చెబుతూ ఉంటుంది జైలులో ఉన్న దీప. "ఇక మీదట శౌర్యకు అమ్మైనా, నాన్నైనా ఇక అన్నీ కార్తీక్ బాబే. ఇక కార్తీక్ బాబు జీవితంలో దీప లేనట్టే" అని దీప అంటుంది. అప్పగింతలు అయ్యాయా.. ఇంకేమైనా మిగిలాయా అంటూ కార్తీక్ అక్కడికి వస్తాడు.

"అమ్మైనా, నాన్నైనా నేనే అనుకోమన్నావ్.. అది నాకు ఓకే.. కానీ శౌర్య అలా అనుకోలేదు కదా. దానికి అమ్మ కావాలి" అని కార్తీక్ అంటాడు. మరి కొత్త అమ్మను తీసుకొద్దామా అని అడుగుతాడు. కార్తీక్ బాబు.. అని అనసూయ అంటుంది. దీప చెప్పే మాటల సారాంశం ఇదేనంటాడు కార్తీక్. తాను బయటికి రానని బలంగా నమ్ముతున్నట్టు ఉంది అని చెబుతాడు. ఎవరో అన్న మాటలకు నువ్వు తీసుకున్న నిర్ణయంలా ఉందని అంటాడు. ఎవరూ ఏ...