భారతదేశం, మే 6 -- కార్తీక దీపం 2 నేటి (మే 6) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. గౌతమ్‍ను జ్యోత్స్న కలుస్తుంది. దీప మీ డాడీని షూట్ చేయడానికి.. మన పెళ్లి ఆగిపోవడానికి సంబంధం ఏంటి అని జ్యోను గౌతమ్ అడుగుతాడు. నువ్వు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావా అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. లవ్ అంటే లవ్ అని గౌతమ్ అంటాడు. నువ్వు చెప్పావనే కదా దీపకు వార్నింగ్ ఇచ్చానని అంటాడు. అందుకే కదా జైలుకు వెళ్లిందని చెబుతాడు. దీప ఇప్పుడు బయట ఉంది కదా అని జ్యో అంటే.. అది కేవలం బెయిల్, మళ్లీ లోపలికి వెళుతుందని గౌతమ్ అంటాడు. అసలైన నేరస్థులను పోలీసులు పట్టుకుంటే అని జ్యో అనడంతో అతడు షాక్ అవుతాడు.

అసలైన నేరస్తులు ఏంటి.. మీ డాడీని షూట్ చేసింది దీప అని చెప్పావ్ కదా అని గౌతమ్ ప్రశ్నిస్తాడు. మీ నాన్న బాడీలో దిగిన బుల్లెట్ వేరే గన్ నుంచి వచ్చిందా అని అడుగుతాడు. దీంతో జ్యోత్స్న కవర్ చేసు...