భారతదేశం, మే 7 -- కార్తీక దీపం 2 నేటి (మే 7, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. నేను గౌతమ్‍ను కలవడానికి వెళుతున్నట్టు నీకెలా తెలుసు అని పారిజాతాన్ని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. ఫాలో అవుతున్నావా అని అడుగుతుంది. నువ్వు నేను పెంచిన మొక్కవే.. జాగ్రత్తగా కాపాడుకోవద్దు అని పారు అంటుంది. నాశనం చేసేలా ఉన్నావ్ అని జ్యోత్స్న చిరాకు పడుతుంది. బావను తప్ప ఏవరినీ పెళ్లి చేసుకోనని చెప్పా కదా అని అంటుంది. మరి గౌతమ్‍ను వదిలివేయవచ్చు కదా అని పారు అంటుంది. చివరికి అదే చేస్తానని జ్యో అంటుంది. మధ్యలో ఏం చేస్తున్నావో చెప్పు అని పారిజాతం అంటుంది. నా జీవితం కోసం ఇష్టమైన పని జ్యో మాట్లాడుతుంది.

నీ జీవితాన్ని నాశనం చేసే తప్పు ఏదైనా ఉంటే అని పారిజాతం అంటుంది. ఉండదు అని జ్యో బదులిస్తుంది. దీప బయటికి వచ్చేసింది.. అసలైన నేరస్తుల కోసం పోలీసులు వెతుకుతున్నారని పారిజాతం అంట...