భారతదేశం, ఏప్రిల్ 28 -- కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 28, 2025) 343వ ఎపిసోడ్‍‍లో ఏం జరిగిందంటే.. నిద్రపోయేటప్పుడు మంచంపై పక్కన శౌర్య లేదని కార్తీక్ గమనిస్తాడు. రౌడీ ఏది.. నిద్రపట్టడం లేదని వాళ్ల నానమ్మ దగ్గరికి వెళ్లి పడుకుందేమో అనుకుంటాడు. ఇంతలో అక్కడే పెన్ను, పేపర్ కనిపిస్తుంది. రౌడీ.. రౌడీ అంటూ శౌర్యను కార్తీక్ పిలుస్తాడు. ఆ తర్వాత శౌర్య మీ దగ్గరికి వచ్చిందా అని కాంచనను కార్తీక్ అడుగుతాడు. రాలేదని అనసూయ చెబుతుంది. శౌర్యను చూసేందుకు బయటికి వెళతాడు కార్తీక్. కాంచన కంగారు పడుతుంది.

శౌర్య కోసం ఇంటి బయట వెతుకుతాడు కార్తీక్. శౌర్య చెప్పులు కూడా ఉండవు. దీంతో టెన్షన్ పడతాడు. గేట్ ఓపెన్ చేసి ఉందని, వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్లి ఉంటుందని సైకిల్ తీసుకొని శౌర్యను వెతికేందుకు కార్తీక్ వెళతాడు. లెటర్ పట్టుకొని రోడ్డుపై పరుగెత్తుకొని వెళుతున్న శౌర్యను క...