భారతదేశం, మే 5 -- కార్తీక దీపం 2 నేటి (మే 5, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. నువ్వు ఆ ఇంటికి వెళుతున్న సంగతి జ్యోత్స్నకు ఎలా తెలిసిందని దీపతో కార్తీక్ అంటాడు. అంతా ప్లాన్ చేసినట్టు నువ్వు గన్ పట్టుకున్న సమయానికే ఎలా షూట్ చేస్తారు, అంటే నువ్వు ఆ ఇంటికి వెళుతున్న విషయం ఎవరికో తెలుసని అనుమానస్తాడు. తనను ఎవరూ ఫాలో కాలేదని, జ్యోత్స్న కాల్ చేస్తే ఇంటికి వెళుతున్న విషయం నేనే చెప్పానని దీప అంటుంది. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమవుతోందని, రెస్టారెంట్‍లో కావేరి చిన్నమ్మ వినాలనే జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకొని ఉంటారని కార్తీక్ అంటాడు.

కావేరి నీతో చెబుతుందనే జ్యోత్స్న, పారిజాతం అలా మాట్లాడుకొని ఉంటారని తన అంచనా అని కార్తీక్ అంటాడు. నువ్వు బయలుదేరిన విషయం చెప్పడంతో నిన్ను చంపడానికి జ్యోత్స్న ప్లాన్ చేసి ఉంటుందని కార్తీక్ అంటాడు. అయితే, జ్యోత్స్న అంత త...