భారతదేశం, ఏప్రిల్ 30 -- కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 30) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దశరథ్ శరీరంలో దిగిన బుల్లెట్ దీప పట్టుకున్న గన్ నుంచి రాలేదని ఫోరెన్సిక్ ఇచ్చిన రిపోర్టును జడ్జి చదువుతారు. నా క్లైంట్ దీప కూడా తాను గన్ పేల్చలేదని ముందు నుంచి చెబుతోందని లాయర్ కల్యాణ్ ప్రసాద్ అంటాడు. ఇప్పుడు దానికి ఆధారాలు వచ్చాయని చెబుతాడు. జ్యోత్స్న రెచ్చగొట్టడం వల్లే దీప గన్‍ను చేతిలోకి తీసుకుందని అంటాడు. సరిగ్గా అదే సమయంలో బుల్లెట్ తగిలిందని, మరి పేల్చిన గన్ ఎవరది అని కల్యాణ్ ప్రసాద్ అంటాడు.

"దశరథ్‍కు తగిలిన బుల్లెట్ ఏ గన్‍లో నుంచి వచ్చింది.. అక్కడ వీళ్లలతో పాటు వేరే మనిషి కూడా ఉన్నాడు.. అతను ఎవరు? దీపను ఎందుకు ఈ కేసులో ఇరికించాలని అనుకుంటున్నాడు? దీపపై అంత పగ ఎవరికి ఉంది?" అని కల్యాణ్ ప్రసాద్ అంటాడు. వేరే గన్ నుంచి బుల్లెట్ వచ్చి ఉంటే.. శివన్నారాయణ ...