భారతదేశం, ఏప్రిల్ 26 -- కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్ (ఏప్రిల్ 26)లో ఏం జరిగిందంటే.. జైలులోని దీప బయటికి రావాలని కోరుకుంటూ కాంచన, అనసూయ పూజ చేసేందుకు రెడీ అవుతారు. దీపాలు వెలిగించేందుకు ప్రమిదలు చేస్తుంటారు. నేనూ చేస్తా నాయనమ్మ అని శౌర్య అడుగుతుంది. సరే చెయ్ అని, ఎలా చేయాలో చెబుతుంది కాంచన. నాన్న ఇంకా రాలేదేంటి.. అమ్మతో వస్తాడా అని శౌర్య అడుగుతుంది.

అమ్మను నాన్న తీసుకొస్తాడు కదా అని శౌర్య అడుగుతుంది. బుధవారం తీసుకొస్తానని చెప్పాడు కదే అని అనసూయ బదులిస్తుంది. అప్పటి వరకు అమ్మ ఎక్కడ ఉంటుందని శౌర్య ప్రశ్నిస్తుంది. పోలీస్ స్టేషన్‍లోనా అని అడుగుతుంది. ఇంతలో కార్తీక్ వస్తాడు. నాన్న అంటూ ఆనందంగా అంటుంది శౌర్య.

కార్తీక్ చోక్కాకు రక్తం ఉండడాన్ని శౌర్య గమనిస్తుంది. నాన్న షర్టుకు రక్తం ఉంది నానమ్మ అని శౌర్య అంటుంది. ఏమైందని కాంచన అడుగుతుంది. రోడ్డు ...