భారతదేశం, జూలై 30 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ లో కిచెన్ లో చిరాకుగా ఉన్న దీపతో కార్తీక్ మాట్లాడుతాడు. పారిజాతం చాలా ఓవర్ చేస్తున్నారని కార్తీక్, దీప మాట్లాడుకుంటారు. ఆవిడ పైత్యం వదిలిపోవడానికి అల్లం కర్రీ చేస్తానని, ఆవిడను కంట్రోల్ చేయాలని దీప అంటుంది. నేను ఆ ఛాన్స్ కోసమే చూస్తున్నానని కార్తీక్ అని కారు సర్వీసింగ్ కు ఇవ్వడానికి వెళ్తూ హాల్లో పారును చూస్తాడు.

ఏమైంది పారు అని కార్తీక్ అడుగుతాడు. మనసు బాధగా ఉందని పారు అంటే.. నీది కొండరాయిలా గట్టిగా ఉండే మనసు కదా అది బాధపడిందంటే ఘోరమైన విపత్తు జరగాలని కార్తీక్ అంటాడు. అప్పుడు శివన్నారాయణను రూ.50 వేలు అడిగానని, కానీ రూ.10 కూడా ఇవ్వనని అన్నాడని పారు చెప్తుంది. దీపను పిలిచి మన ఇంట్లో పెత్తనం ఎవరిది అని అడుగుతాడు కార్తీక్. పారును ఇరికించడానికి బావ ఏదో ప్లాన్ చేశాడని అనుకున్న దీప.. నాద...