Hyderabad, ఏప్రిల్ 29 -- Karthika deepam 2 serial april 29th episode: కారు డ్రైవ్ చేయలేనప్పుడు తనకు ఒక్క ఫోన్ చేయవచ్చు కదాని కార్తీక్ అంటాడు. ఫోన్ వచ్చిందని వెళ్లిపోయావ్ కదా. నువ్వు అలా వెళ్ళిపోవడం నా ఫ్రెండ్స్ ముందు నాకు ఎంత అవమానమో తెలుసా? నీమీద కోపంతోనే నేను తాగానని అంటుంది.

కోపంతో మనుషులను చంపేస్తావా అంటాడు. నీకు ప్రేమ విలువ తెలుసా అంటే నీకు ప్రాణం విలువ తెలుసా అని తిడతాడు. ఒక మనిషి ప్రాణం పోతే ఆ కుటుంబం అనాథ అవుతుంది. డబ్బులతో కూడా మనం చేసిన తప్పు సరిదిద్దుకోలేము. ఆ బాధ మన నీడ లాంటిది దానితో మనం ప్రయాణం చేయడం నరకం అంటాడు.

నీకు ముందే చెప్పాను కాల్ వస్తే వెళ్లిపోతానని అంటే రేపు పెళ్లి అయిన తర్వాత కూడా ఇలాగే వదిలేసి వెళ్లిపోతావా అని జ్యోత్స్న గట్టిగా అడుగుతుంది. నీకు పార్టీలు అంటే ఇష్టం లేదా నేనంటే ఇష్టం లేదా? నేను చిన్నప్పటి నుంచి బా...