Hyderabad, జూలై 31 -- స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ 29వ వారం టీఆర్పీ రేటింగ్స్ గురువారం (జులై 31) రిలీజ్ అయ్యాయి. ఈసారి కూడా రేటింగ్స్ లో చెప్పుకోదగిన మార్పులు జరిగాయి. ఓవరాల్ గా స్టార్ మా సీరియల్సే సత్తా చాటినా.. వాటిలోనూ మార్పులు చోటు చేసుకోవడంతోపాటు ఓ జీ తెలుగు సీరియల్ ఈవారం ఆశ్చర్యపరిచింది. మరి ఏ సీరియల్ రేటింగ్ ఎలా ఉందో చూడండి.

స్టార్ మా సీరియల్స్ 29వ వారం కూడా సత్తా చాటాయి. అయితే ఈవారం తొలి స్థానంలో ఉన్న కార్తీకదీపం 2 సీరియల్ రేటింగ్ మరింత మెరుగైంది. తాజా రేటింగ్స్ లో ఆ సీరియల్ 14.70తో మరింత ఎత్తుకు చేరింది. ప్రతి వారం ఈ సీరియల్ రేటింగ్ పెరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈసారి రెండో స్థానం మళ్లీ చేతులు మారింది.

తన కోల్పోయిన ఈ స్థానాన్ని ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తిరిగి దక్కించుకుంది. తాజాగా ఆ సీరియల్ కు 13.43 రేటింగ్ రావడం వ...