భారతదేశం, ఆగస్టు 24 -- చాలా మంది సొంత కారు కల. ఇందుకోసం చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే కారు లోన్ కోసం కూడా ప్రయత్నిస్తుంటారు. చాలా మంది బ్యాంకు నుండి రుణం తీసుకొని కారు కొని నెలవారీ ఈఎంఐ ద్వారా కారుకు చెల్లిస్తారు. ఇందుకోసం వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. మీరు బ్యాంకు నుండి కారు రుణం తీసుకుని కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ముందుగా వివిధ బ్యాంకుల వడ్డీ రేట్ల గురించి తెలుసుకోవాలి. దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల కారు రుణాల వడ్డీ రేట్ల గురించి తెలుసుకుందాం..

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ కార్ లోన్ వడ్డీ రేట్ల గురించి చూస్తే.. కార్ లోన్ ప్రారంభ వడ్డీ రేటు 8.85 శాతంగా ఉంది. ఇది తర్వాత సిబిల్ స్కోర్ ఆధారంగా మారవచ్చు.

దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి కారు రుణాలపై వడ్డీ రేట్లు 8.75 శాతం నుం...