భారతదేశం, జనవరి 8 -- రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. యశ్ 40వ పుట్టినరోజు సందర్భంగా 'టాక్సిక్' (Toxic) మూవీ మేకర్స్ ఒక పవర్ ప్యాక్డ్ టీజర్‌ను కానుకగా అందించారు. చీకటి సామ్రాజ్యం, రక్తపాతం, గన్స్‌తో నిండిన ఈ గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ యశ్ తన ఊరమాస్ లుక్‌తో అలరించారు.

"మీ ముందుకు వస్తున్న డేంజర్‌ను ఒకసారి జాగ్రత్తగా చూడండి.. పరిచయం చేస్తున్నాం 'రాయ'ను" అనే క్యాప్షన్‌తో చిత్రబృందం సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేసింది మూవీ టీమ్. యశ్ టాక్సిక్ టీజర్ బోల్డ్ అండ్ వైల్డ్‌గా అదిరిపోయింది.

టాక్సిక్ టీజర్ ఒక స్మశానవాటికలో జరుగుతున్న అంత్యక్రియల సీన్‌తో మొదలవుతుంది. అక్కడి నుంచి కుటుంబ సభ్యులు హడావిడిగా వెళ్లిపోతుండగా, ఒక కారు ఎంట్రీ ఇస్తుంది. ఆ కారులో నటితో యశ్ శృంగారం చేసే సీన్స్ చూపి...