భారతదేశం, డిసెంబర్ 31 -- చైనా ఆటోమొబైల్ కంపెనీలు తమ వినూత్న ఫీచర్లతో ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటున్నాయి. గతంలో గాలిలోకి ఎగిరే (జంప్ చేసే) బీవైడీ 'యాంగ్‌వాంగ్ యూ9' సూపర్ కార్ వార్తల్లో నిలవగా, ఇప్పుడు మరో వింత ఫీచర్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. 'హ్యూమన్ హారిజన్స్' సంస్థకు చెందిన 'హైఫీ జెడ్' (HiPhi Z) ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో కారు వెనుక భాగంలో కనిపించే 'యూ-టర్న్' ఇండికేటర్​ అందరినీ ఆకర్షిస్తోంది.

సాధారణంగా వాహనాలకు ఎడమ లేదా కుడి వైపు తిరిగేందుకు ఇండికేటర్లు ఉంటాయి. కానీ ఈ ఎలక్ట్రిక్​ కారులో మాత్రం యూ- టర్న్​ ఇండికేటర్​ కూడా ఉంది! డ్రైవర్ యూ-టర్న్ తీసుకోవాలనుకున్నప్పుడు, కారు వెనుక భాగంలో "యూ- టర్న్​" ఇండికేటర్​ వెలుగుతుంది. ట్రాఫిక్‌లో వెళుతున్నప్పుడు ఈ కారు యూ-టర్న్ తీసుకునే మ...