భారతదేశం, ఆగస్టు 4 -- చాలామంది వాహనాలకు ఇన్సూరెన్స్ లేకుండానే రోడ్ల మీదకు వస్తారు. ఈ రకమైన ధోరణి ప్రజల్లో పెరుగుతోంది. ప్రజలు తమ కారు బీమా పాలసీ గడువు ముగిసిన తర్వాత కూడా రోడ్డుపైకి తీసుకెళ్తారు. అలాంటి వాహనాలతో ప్రమాదం జరిగితే, నష్టాన్ని భర్తీ చేయలేం. ఈ విషయం తెలిసి కూడా పట్టించుకోం. ఈ ధోరణిని ఆపడానికి కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టంలో కొన్ని మార్పులు చేయనుంది. దీని తర్వాత అలాంటి వాహనాన్ని నడిపినందుకు భారీ జరిమానా కూడా ఉంటుంది.

ఆంగ్ల మీడియా కథనాల ప్రకారం.. రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త నియమాలను తీసుకురానుంది. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మోటారు వాహనాల చట్టంలో కొన్ని మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మార్పుల కారణంగా రోడ్లపై బీమా లేని మోటారు వాహనాన్ని నడపడం ప్రజలకు కాస్ట్‌లీగా మారవచ్చు.

బీమా లేకుం...