భారతదేశం, జూలై 30 -- మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అంటే విలక్షణమైన యాక్టింగ్ కు పెట్టింది పేరు. హీరో పాత్రలైనా, ఇతర కీ రోల్స్ అయినా అతని యాక్టింగ్ వేరే లెవల్ లో ఉంటుంది. సూపర్ డీలక్స్, 96, విక్రమ్ వేద, మహారాజా, ఉప్పెన వంటి చిత్రాలలో తన ఐకానిక్ పాత్రలతో అదరగొట్టాడు విజయ్. షారుక్ ఖాన్ జవాన్ సినిమాతో బాలీవుడ్ లోనూ సత్తాచాటాడు విజయ్ సేతుపతి. ఇప్పుడు ఈ స్టార్ నటుడిపై సంచలన క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వస్తున్నాయి.

రమ్య మోహన్ అనే యూజర్ తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా విజయ్ సేతుపతిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. విజయ్ సేతుపతి డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ తదితర అంశాలను ప్రస్తావిస్తూ.. చిత్ర పరిశ్రమలో విషపూరిత సంస్కృతిని కొనసాగించడంలో పాలుపంచుకున్నారని ఆమె ఆరోపించింది.

"కోలీవుడ్‌లో డ్రగ్స్ & కాస్టింగ్ కౌచ్ సంస్కృతి ఒక జోక్ కాదు. నాకు తెలిసిన ఒక...