భారతదేశం, అక్టోబర్ 31 -- ఓటీటీలోకి తమిళ మూవీ ఒకటి దూసుకొచ్చింది. డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన 'మరియా' సినిమా నెల రోజుల్లోపే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇవాళ (అక్టోబర్ 31) రెండు ఓటీటీల్లోకి అడుగుపెట్టింది. సన్యాసినిగా ఉండే ఓ అమ్మాయి కామ కోరికలతో ఎలా ఇబ్బంది పడిందనే కథతో మరియా సినిమాను రూపొందించారు. ఒకే రోజు రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ.

కాంట్రవర్సీకి కూడా కారణమైన తమిళ సినిమా 'మరియా' ఓటీటీలో అడుగుపెట్టింది. శుక్రవారం రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో రిలీజైంది. అక్టోబర్ 31 నుంచి సింప్లీ సౌత్ తో పాటు షార్ట్ ఫ్లిక్స్ లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. సింప్లీ సౌత్ ఓటీటీలో ఇండియా బయట దేశాల్లోని ఆడియన్స్ కు అందుబాటులో ఉంది ఈ సినిమా. ఇండియాలోని ఆడియన్స్ మాత్రం షార్ట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు. ఇప్పుడైతే తమిళంలోనే మూ...