Hyderabad, సెప్టెంబర్ 17 -- మసూద, పరేషాన్ సినిమాలతో ఆకట్టుకున్న వెర్సటైల్ యాక్ట‌ర్ తిరువీర్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఈ సినిమాలో తిరువీర్‌కు జోడీగా టీనా శ్రావ్య హీరోయిన్‌గా నటిస్తోంది. 7 పీఎమ్ ప్రొడక్షన్స్, ప‌ప్పెట్ షో ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌‌‌పై సందీప్ అగ‌రం, అస్మితా రెడ్డి బాసిని ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాకు రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. న‌వంబ‌ర్ 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ మంగ‌ళ‌వారం (సెప్టెంబర్ 16) ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో టీజ‌ర్‌ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల రిలీజ్ చేశారు.

"ప్రపంచానికి తెలియటం కంటే ముందే తిరువీర్ గురించి నాకు తెలుసు. తను కలల ప్రపంచంలో జీవించటాన్ని చూసి నేను సంతోషపడుత...