Hyderabad, జూలై 18 -- ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ప్రత్యేకించి ఆరాధిస్తూ ఉంటాము. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే కూడా ఎంతో మంచి జరుగుతుంది, పుణ్యం వస్తుంది. ఈ సంవత్సరం కామిక ఏకాదశి జూలై 21న వచ్చింది. ప్రతి సంవత్సరం ఆషాడ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి కామిక ఏకాదశి అంటారు. ఈసారి కామిక ఏకాదశి ఇంకా ప్రత్యేకము. ఎందుకంటే కామిక ఏకాదశి నాడు అద్భుతమైన యోగాలు ఏర్పడతాయి. కామిక ఏకాదశి నాడు ఎలాంటి యోగాలు ఏర్పడతాయి, వాటి వలన ఎలాంటి లాభాలు పొందవచ్చో వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

శుభకార్యాలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. వృద్ధి యోగం పురోగతిని తీసుకువస్తుంది, విజయాలను అందిస్తుంది. సంపద కూడా కలిగి, సంతోషంగా ఉండవచ్చు. పరమేశ్వరుడిని కామిక ఏకాదశి నాడు పూజించడం వలన అధిక శ్రేయస్సు కలుగుతుంది.

కామిక ఏకాదశి నాడు సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడింది. ఇది మన కోరికలను తీర...