Telangana,kamareddy, సెప్టెంబర్ 12 -- బీసీ కోటా అంశంపై కామారెడ్డి పట్టణంలో సెప్టెంబర్ 15న జరగనున్న బహిరంగ సభను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది.

వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయడానికి పార్టీ చేస్తున్న ప్రయత్నాలను వివరించడానికి ఈ బహిరంగ సభను నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 2 లక్షలకుపైగా జనాలతో సభను విజయవంతం చేయాలని. బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలని చూస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సభను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అతి త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని చెప్పింది.

రాష్ట్రంలోని బ...