భారతదేశం, జనవరి 7 -- గత కొంతకాలంగా అవినీతి అధికారులు భరతం పడుతోంది తెలంగాణ ఏసీబీ. పక్కా సమాచారంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటోంది. తాజాగా కామారెడ్డి జిల్లాలో తహసీల్దార్ గా పని చేస్తున్న శ్రీనివాసరావు అనే అధికారి పట్టుబడ్డాడు. రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా దొరికిపోగా కేసు నమోదైంది.

ఏసీబీ విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం.. నాగిరెడ్డిపల్లి మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి(ఫిర్యాదుదారుడు) తన తండ్రి పేరు మీద ఉన్న వ్యవసాయభూమిని తనపైకి మార్చుకునేందుకు ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే సంబంధిత అధికారులకు నివేదిక పంపేందుకు ఫిర్యాదుదారుడిని తహసీల్దార్(ఎమ్మార్వో) యార్లగడ్డ శ్రీనివాసరావు రూ. 50 వేలు డిమాండ్ చేశాడు.

ఈ లంచాన్ని ప్రైవేట్ వ్యక్తి అయిన చిన్నూరి అజయ్ సహాయంతో తీసుకునేందుకు ప్రయత్నాలు చేశాడు. సదరు ఫిర్యాదుదారుడు ఏసీ...