Telangana,kamareddy, ఆగస్టు 29 -- రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. బుధవారం కురుసిన భారీ వర్షంతో కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారాయి. ముఖ్యమంగా కామారెడ్డి జిల్లాల్లో వరద ఏరులై పారుతోంది. పట్టణంలోని పలు కాలనీలు జలదిగ్భందంలోనే ఉన్నాయి.

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షపాతం తీవ్ర స్థాయిలో ఉండటంతో వరదల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. పట్టణంలోని హోసింగ్ బోర్డు కాలనీ, కౌండిన్య ఎంక్లేవ్ , జీఆర్ కాలనీ, పంచముఖి హనుమాన్ కాలనీలోని రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. మరోవైపు కామారెడ్డి పెద్ద చెరువు నుంచి వరదు ప్రవాహం దాటిగా ఉంది.

కామారెడ్డి పట్టణంతో పాటు జిల్లాల్లోని చాలాచోట్లు రోడ్లు భారీగా దెబ్బతిన...