Hyderabad, ఏప్రిల్ 25 -- వేసవిలో కాటన్ దుస్తులు ఎంత హాయినిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవి తేలికగా, సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా చల్లగా ఉంచుతాయి. అయితే చాలామంది ఎదుర్కొనే సమస్య ఏంటంటే.. కాటన్ బట్టలు ఒక్క ఉతుక్కే రంగు పోతుంటాయి. కొత్తగా కొన్న కాటన్ కుర్తానో, దుపట్టానో మొదటిసారి ఉతికినప్పుడే దాని రంగంతా నీళ్లలో కలిసిపోతుంది. ఇలా తరచూ జరగడం వల్ల దుస్తులు తొందరగా పాతబడినట్లు కనిపిస్తాయి.

మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారా? మీ కొత్త కాటన్ దుస్తుల రంగు పోకుండా ఉండటానికి ఏం చేయాలో ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. మీ కాటన్ దుస్తులు ఎక్కువ కాలం ఆకర్షణీయంగా, కలర్ ఫుల్‌గా కనిపించడానికి మీకు సహాయపడే కొన్ని సింపుల్ చిట్కాలు మీకోసం ఇక్కడున్నాయి!

కాటన్ దుస్తుల రంగు ఎందుకు కారుతుంది అని ఆలోచన చాలా మందిలో కలిగి ఉంటుంది. నిజానికి కాటన్ దారాలు...