Warangal,telangana, జూలై 20 -- కాజీపేటలో నిర్మించనున్నరైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులను శనివారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. యూనిట్ నిర్మాణంతో పాటు పలు పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి.. వచ్చే ఏడాది నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని ప్రకటించారు.

హైదరాబాద్ కు 130 కిలోమీటర్ల దూరంలోని కాజీపేటలోని యూనిట్ అందుబాటులోకి రానుందని కేంద్రమంత్రి వైష్ణవ్ పేర్కొన్నారు. రూ.500 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న భారీ, అత్యాధునిక కర్మాగారమని తెలిపారు. కోచ్లు, ఇంజిన్లు, ఇతర భాగాలను ఈ యూనిట్లో తయారు చేయవచ్చని వివరించారు. అంతేకాకుండా అనేక రకాలుగా తోడ్పడుతుందని పేర్కొన్నారు.

ఈ కర్మాగారం ప్రపంచంలోనే అత్యుత్తమ డిజైన్లను కలిగి ఉంటుందని కేంద్రమంత్రి ప్రకటించారు. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులు ఎగుమత...