భారతదేశం, ఆగస్టు 14 -- ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కంపెనీలోని దాదాపు 80 శాతం మంది ఉద్యోగులకు నవంబర్ 1, 2025 నుంచి జీతాలు పెంచుతున్నట్టు ప్రకటించింది. వాస్తవానికి ఈ పెంపు ఆగస్టులోనే రావాల్సింది. కానీ, మూడు నెలల ఆలస్యంగా ఈ నిర్ణయం వెలువడింది. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) జతిన్ దలాల్ మాట్లాడుతూ, "మ్యాక్రో ఎకనామిక్ కారణాల" వల్ల ఈ ఆలస్యం జరిగిందని రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధి కూడా ధృవీకరించారు.

ఈ ఏడాది మొదట్లో కాగ్నిజెంట్ తన ఉద్యోగులకు గత మూడేళ్లలో ఎప్పుడూ లేనంత ఎక్కువ బోనస్‌లను ఇచ్చింది. ప్రస్తుతం ఈ సంస్థలో 3,43,800 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇటీవల, జులైలో కంపెనీ తన మూడో త్రైమాసిక ఆదాయ అంచనాల్లో వాల్ స్ట్రీట్ అంచనాలను అధిగమించింది. దీనికి ప్రధాన కారణం, కస్టమర్లు ఆ...