Hyderabad, సెప్టెంబర్ 6 -- సెప్టెంబర్ 7 నుంచి పితృపక్షం మొదలవుతుంది. 15 రోజులు పాటు ఇది ఉంటుంది. పితృపక్షం సమయంలో చనిపోయిన పూర్వికుల ఆశీర్వాదాలు ఉండాలని, పితృదోషాలు తొలగిపోయి సంతోషంగా ఉండాలని, ఈ 15 రోజులు తర్పణాలు వదలడం, దాన ధర్మాలు చేయడం, పిండ ప్రధానం చేయడం వంటి వాటిని ఎవరికి నచ్చిన విధంగా వారు పాటిస్తూ ఉంటారు. పితృపక్షం సెప్టెంబర్ 7 నుంచి మొదలై 15 రోజులు పాటు ఉంటుంది. పితృపక్షంలో కాకుల ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

మన హిందూ సంప్రదాయం ప్రకారం కాకులను పూర్వికుల రూపం అని అంటారు. ఎవరికైనా పిండప్రధానం చేసినప్పుడు కాకి వెనుక భాగంలో కూర్చుంటే దానిని శుభప్రదం అని అంటారు. అయితే అసలు కాకిని ఎందుకు పూర్వికుల ప్రతిరూపంగా భావిస్తారు? దాని వెనక కారణం ఏంటి? హిందూ శాస్త్రం ఏం చెప్తోంది? ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

త్రేతాయు...