భారతదేశం, ఏప్రిల్ 21 -- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సామాజిక బహిష్కరణ వార్తలు కలకలం రేపాయి. పిఠాపురం నియోజక వర్గంలో ఉన్న మల్లం గ్రామంలో రెండు సామాజిక వర్గాల మధ్య తలెత్తిన వివాదాలతో ఓ వర్గంపై ఆంక్షలు విధించినట్టు ప్రచారం జరిగింది. గ్రామంలో కొద్ది రోజుల క్రితం విద్యుదాఘాతంతో జరిగిన ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య వివాదం రాజుకుంది.

పిఠాపురం రూరల్‌ పరిధిలోని మల్లాం గ్రామంలో జరిగిన ప్రమాదంలో మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు ఆందోళనకు దిగడంతో యజమాని రెండున్నర లక్షల పరిహారం చెల్లించాడు. పనిలో జరిగిన ప్రమాదానికి పరిహారం చెల్లించాల్సి రావడంతో, మృతుడి సామాజిక వర్గం మొత్తాన్ని పనిలోకి పిలవకూడదని నిర్ణయించుకోవడంతో వివాదం తలెత్తిందని జిల్లా అధికారులు తెలిపా...