Andhrapradesh,kakinada, సెప్టెంబర్ 10 -- కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ మేరకు అధికారులు వివరాలను వెల్లడించారు.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి. ఈ గడువు సెప్టెంబర్ 26వ తేదీతో పూర్తవుతుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా నియామక పక్రియను పూర్తి చేస్తారు. కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. బ్యాంకింగ్/ఫైనాన్షియల్ అనుభవం ఉన్నవారు కనీసం 50 శాతం మార్కులు ఉన్నా అర్హులవుతారని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....