భారతదేశం, నవంబర్ 8 -- కాకినాడ జిల్లాలోని కిర్లంపూడి మండలం సోమవరం దగ్గర హైవేపై కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచివున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కారు ఫ్రంట్‌ టైరు పేలడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రాథమిక వివరాల ప్రకారం.. అన్నవరం నుంచి జగ్గంపేటకు వెళ్తున్న కారు ఫ్రంట్ టైర్ పేలడంతో కారు అదుపు తప్పింది. ఈ క్రమంలోనే సోమవరం దగ్గర హైవేపై ఉన్న బస్సు షెల్టర్‌లోని ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఓ బైక్ ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిని అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.దర్యాప్తు చేస్తున్నారు.

Published by H...