భారతదేశం, నవంబర్ 6 -- మరో క్రేజీ ప్రాజెక్ట్ తో హిట్ కొట్టేందుకు వచ్చేస్తున్నాడు దుల్కర్ సల్మాన్. అతను హీరోగా యాక్ట్ చేస్తున్న 'కాంత' సినిమా ట్రైలర్ ఇవాళ (నవంబర్ 6) రిలీజైంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి తదితరులు నటిస్తున్నారు.

1950ల నాటి మద్రాస్ సినీ పరిశ్రమ, షూటింగ్ నేపథ్యంలో కాంత మూవీ సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమైంది. ఈ సినిమా ట్రైలర్ ను గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. వేఫేరర్ ఫిల్మ్స్, స్పిరిట్ మీడియా పతాకాలపై దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి సంయుక్తంగా నిర్మించిన ఈ పీరియాడిక్ డ్రామా థ్రిల్లర్ చిత్రం 1950ల నాటి మద్రాస్ నేపథ్యంలో సాగుతుంది. కాంత ట్రైలర్‌ను తమిళం, తెలుగు భాషల్లో ట్విట్టర్‌లో షేర్ చేశాడు దుల్కర్.

కాంత ట్రైలర్ 'కింగ్ ఆఫ్ యాక్టింగ్' చంద్రన్ (సల్మాన్)...