భారతదేశం, డిసెంబర్ 12 -- కాంత మూవీ థియేటర్లలో రిలీజైనప్పుడు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. దుల్కర్ సల్మాన్ నటన తప్ప మూవీలో పెద్దగా ఏమీ లేదని చాలా మంది అన్నారు. కానీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన తర్వాత మాత్రం మొత్తం పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. ఇదో మాస్టర్ పీస్ అని ఫ్యాన్స్ కొనియాడుతుండటం విశేషం.

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే లీడ్ రోల్స్ లో నటించిన మూవీ కాంత. ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ కాగా.. నెల రోజుల్లోపే శుక్రవారం (డిసెంబర్ 12) నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టింది. అయితే ఈ మూవీ వచ్చీ రాగానే ఫ్యాన్స్ ఎగబడి చూస్తున్నారు. సోషల్ మీడియా ఎక్స్ లో తమ రివ్యూలు పోస్ట్ చేస్తున్నారు. ఇదో మాస్టర్ పీస్ అని, దుల్కర్, భాగ్యశ్రీ, సముద్రఖని నటన అద్భుతమని అంటున్నారు.

ఓ అభిమాని ఎక్స్ లో కాంత మూవీ గురించి ఇలా రాశారు. "దుల్కర్ సల్మాన్, సము...