భారతదేశం, అక్టోబర్ 8 -- రిషబ్ శెట్టి సినిమ కాంతార చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్‌ను తుఫానులా తాకింది. ఈ సినిమా వీక్ డేస్ లోనూ నిలకడగా కలెక్షన్లు రాబడుతోంది. ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల మైలురాయి దాటేసింది ఈ సినిమా. ఈ ఫ్రాంఛైజీలో వచ్చిన ఫస్ట్ మూవీ కాంతార రికార్డుపై కన్నేసింది కాంతార చాప్టర్ 1.

పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న కాంతార చాప్టర్ 1 కలెక్షన్ల జోరు కొనసాగిస్తోంది. ఈ సినిమా ఆరో రోజు, మంగళవారం (అక్టోబర్ 7) రూ.33.5 కోట్లు ఖాతాలో వేసుకుంది. అన్ని భాషల్లో కలిసి ఈ వసూళ్లు సాధించింది. దీంతో ఈ సినిమా ఆరు రోజుల ప్రపంచవ్యాప్త కలెక్షన్లు రూ.407 కోట్లకు చేరాయి.

కాంతార చాప్టర్ 1 ఇండియా వసూళ్లు చూసుకుంటే ఆరు రోజుల్లో ఈ సినిమా ఇక్కడ రూ.290.25 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. ఇండియా గ్రాస్ ఏమో రూ.347 కోట్లుగా ఉంది. ఓవర్సీస్ గ్రాస్ రూ.60 ...