Hyderabad, సెప్టెంబర్ 22 -- కాంతార ఛాప్టర్ 1 ట్రైలర్ వచ్చేసింది. ప్రముఖ కన్నడ నటుడు రిషబ్ శెట్టి లీడ్ రోల్లో నటించి, డైరెక్ట్ చేసిన కాంతార మూవీకి ఇది ప్రీక్వెల్. అసలు కాంతారలో ఏం జరిగిందన్నది ఈ మూవీ కళ్లకు కట్టబోతోంది. సోమవారం (సెప్టెంబర్ 22) రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత భారీగా పెంచేసింది.

మూడేళ్ల కిందట వచ్చిన కాంతార మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలుసు కదా. కర్ణాటకలోని ఓ సాంప్రదాయ కళను ప్రధాన కథాంశంగా తీసుకొని తీసిన ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇప్పుడీ మూవీ ప్రీక్వెల్ కాంతార ఛాప్టర్ 1 వస్తోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. కాంతార కంటే భిన్నంగా ఈసారి గత చరిత్రను ఈ ప్రీక్వెల్లో చూపించబోతున్నారు. అంతేకాదు ఈ ట్రైలర్ లో భారీతనం కనిపిస్తోంది.

గ్రాండ్ విజువల్స్, రిషబ్ శెట్టి యాక్షన్, యువరాణిగా రుక్మిణి వసంత్ రోల్,...