భారతదేశం, అక్టోబర్ 27 -- కాంతార ఛాప్టర్ 1 సినిమా డిజిటల్ ప్రీమియర్ కోసం ప్రేక్షకులు మరీ ఎక్కువ రోజులు ఎదురు చూడకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో చాలా ముందుగానే ఓటీటీలోకి తీసుకొస్తోంది. ఆదివారం (అక్టోబర్ 26) రాత్రి ఈ మూవీ స్ట్రీమింగ్ పై అప్డేట్ ఇచ్చిన ఆ ఓటీటీ.. సోమవారం సాయంత్రానికి స్ట్రీమింగ్ తేదీని కూడా అనౌన్స్ చేసేసింది.

రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, లీడ్ రోల్లో నటించిన కాంతార ఛాప్టర్ 1 మూవీ ఈ శుక్రవారం అంటే అక్టోబర్ 31 నుంచే స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

"బెర్మె లెజెండరీ అడ్వెంచర్ ను చూడటానికి సిద్ధంగా ఉండండి. కాంతార ఛాప్టర్ 1 అక్టోబర్ 31న ప్రైమ్ లోకి.. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా సినిమాలోని ఓ చిన్న వీడియో క్లిప్ ను షేర్ చేసింది...