భారతదేశం, అక్టోబర్ 28 -- కాంతార ఛాప్టర్ 1 ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర రూ.800 కోట్లకుపైగా వసూలు చేసి ఈ ఏడాది అత్యధిక వసూళ్ల ఇండియన్ మూవీగా నిలిచింది. అయితే నాలుగు వారాలు కూడా కాకుండానే ఈ సినిమాను అక్టోబర్ 31 నుంచి ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ చేయనుంది. దీనిపై ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంత అవసరం ఏంటన్న విమర్శల మధ్య ప్రొడ్యూసర్ చలువే గౌడ క్లారిటీ ఇచ్చారు.

'కాంతార ఛాప్టర్ 1' మూవీ నిర్మాత చలువే గౌడ ఇండియా టుడేతో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ సందర్భంగా సినిమాను చాలా త్వరగా ఓటీటీలోకి తీసుకువస్తుండటంపై స్పందించాడు. చలువే గౌడ మాట్లాడుతూ.. "ప్రస్తుతం సినిమా దక్షిణాది భాషల (తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం) వెర్షన్లు మాత్రమే ఓటీటీలో విడుదల అవుతాయి. హిందీ వెర్షన్ కాదు.

హిందీ వెర్షన్ ఎనిమిది వారాల తర్వాత వస్తుంది. ఈ విడుదల విండోకు సంబంధించిన ఒప్పందం వ...