Hyderabad, అక్టోబర్ 2 -- నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ నటించిన దే కాల్ హిమ్ ఓజీ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొదటి వారం పూర్తి చేసుకుంది. ఈ చిత్రం మొదటి వారాంతంలో ఆకట్టుకునే బిజినెస్ చేసింది. కానీ, తరువాత పండుగ సీజన్ ఉన్నప్పటికీ వీకెండ్స్‌లో మందగించింది.

ఇప్పుడు ఓజీ మూవీ గురువారం (అక్టోబర్ 2) విడుదలైన రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతోంది. ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం ఓజీ సినిమాకు ఏడో రోజున ఇండియాలో రూ. 7 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. ఆరో రోజుతో పోలిస్తే ఏడో రోజున 9.4 శాతం వరకు ఓజీ కలెక్షన్స్ తగ్గాయి.

ఇదిలా ఉంటే, ఏడు రోజుల్లో అంటే వారంలో ఓజీ సినిమా ఇండియాలో రూ. 161.85 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే, ఇవాళ కాంతార ప్రీక్వెల్ మూవీ కాంతార చాప్టర్ 1 థియేటర్లలో విడుదలైంది. దీంతో ఓజీ సినిమా 8వ రోజు...