భారతదేశం, నవంబర్ 15 -- జూబ్లీహిల్స్ ఉపెన్నికలో హస్తం జెండా రెపరెపలాడింది. అనుకున్న విధంగానే భారీ మెజార్టీతో విజయఢంకాను మోగించింది. ఇకపై ఇదే స్పీడ్ ను స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చూపించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇక ఆలస్యం చేయకుండా. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఓ నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేసే పనిలో పడింది. కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చూస్తోంది.

ఈనెల 17వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతుంది. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే నవంబర్ 24లోగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో అన్ని అంశాలపై చర్చించి. ఎన్నికల వెళ్లే విషయంపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది.

డిసెంబర్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడాన...