భారతదేశం, ఏప్రిల్ 25 -- కాంగ్రెస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, ఓర్వలేని కాంగ్రెస్ నేతలు మాట్లాడే మాటలను ప్రజలు క్షమించబోరని ఎమ్మెల్సీ కవిత మండి పడ్డారు. హనుమకొండ జిల్లాలో గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. ముందుగా ఓరుగల్లుకు చేరుకున్న కవితకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన రజతోత్సవ సభ పాటను ఆవిష్కరించారు. అనంతరం ఎల్కతుర్తి మండలంలో బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాల కోసం చేస్తున్న ఏర్పాట్లను ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు.

బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీది చేతగాని ప్రభుత్వమని తేటతెల్లమైందని, 16 నెలల పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల కోసం...