Telangana,hyderabad, సెప్టెంబర్ 19 -- కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. 420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ జైత్రయాత్రతో ప్రజలు సురుకు పెట్టాలన్నారు. పొరపాటున కాంగ్రెస్‌ను గెలిపిస్తే సంక్షేమ పథకాలు అమలు కావని వ్యాఖ్యానించారు.

"కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్ రేవంత్ సర్కార్. రాహుల్ నిత్యం విమర్శించే మోడీ, అదానీలను రేవంత్ వెనుకేసుకొస్తున్నాడు. వక్ఫ్ సవరణలను దేశంలోనే తొలిసారిగా రేవంత్ ప్రభుత్వం అమలు చేసింది. చరిత్రలో తొలిసారి ముస్లిం మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది" అని కేటీఆర్ దుయ్యబట్టారు.

తెలంగాణ భవన్‌లో జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.రేపటి తెలంగ...