భారతదేశం, మే 20 -- హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులో సైబర్ నేరగాళ్లు ఓ కస్టమర్ మొబైల్ ఫోన్ ను హ్యాక్ చేసి బ్యాంక్ నుంచి రూ.11.55 కోట్లు డ్రా చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

చంబా జిల్లాలోని హాల్టీ లో ఉన్న హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకు బ్రాంచ్ లో ఖాతా ఉన్న ఒక కస్టమర్ కు చెందిన మొబైల్ నంబర్ కు స్కామర్లు ముందుగా ఒక లింక్ ను పంపించారు. దీని ద్వారా మొబైల్ బ్యాంకింగ్ చేసుకోవచ్చని అతడికి చెప్పారు. దాంతో, ఆ కస్టమర్ ఆ నకిలీ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకున్నాడు. అనంతరం, ఆ కస్టమర్ మొబైల్ నంబర్ ను హ్యాక్ చేసిన మోసగాళ్లు ఈ యాక్సెస్ ను ఉపయోగించి ఆ కస్టమర్ ఖాతాలోని డబ్బులు కాజేశారు. దాంతోపాటు ఆ బ్యాంక్ ఇంటర్నెట్ వ్యవస్థను కూడా యాక్సెస్ చేయగలిగారు. ఆ బ్యాంక్ లోని వివిధ ఖాతాల్లో ఉన్న సుమారు రూ. 11.55 కోట్లను నెఫ్ట్, ఆర్టీజీఎస్...