భారతదేశం, డిసెంబర్ 30 -- నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ప్రజా ప్రయోజనాల కోసం సైబరాబాద్ పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు. అడ్వైజరీ ప్రకారం.. క్యాబ్, టాక్సీ, ఆటోరిక్షా ఆపరేటర్లు యూనిఫాంలో ఉండాలి. చెల్లుబాటు అయ్యే పత్రాలను తమతో కలిగి ఉండాలి. ప్రయాణికులకు రైడ్‌లను తిరస్కరించకూడదు. రైడ్ కోసం బుకింగ్ చేసుకుంటే దాన్ని తిరస్కరిస్తే.. మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం జరిమానాలు ఉంటాయి. ఈ చలాన్ రూపంలో జరిమానా పడుతుంది.

ప్రయాణికులు ఇటువంటి సంఘటనలను 9490617346 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. డ్రైవర్లు దురుసుగా ప్రవర్తించడం, అధిక ఛార్జీలు వసూలు చేయకూడదని పోలీసులు హెచ్చరించారు.

బార్‌లు, పబ్‌లు, క్లబ్‌లు తమ ప్రాంగణంలో మద్యం సేవించిన తర్వాత మద్యం సేవించిన వ్యక్తులు వాహనాలు నడపడానికి అనుమతించకుండా జాగ్రత్త వహించా...