భారతదేశం, మే 20 -- భారతీ ఎయిర్టెల్ తన పోస్ట్ పెయిడ్, ఎయిర్ టెల్ వై-ఫై వినియోగదారులకు 100 జీబీ గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ ను ఆరు నెలల పాటు ఉచితంగా అందించడానికి గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్ జియో గతంలో తన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్ ఆఫర్ ఇచ్చిన నేపథ్యంలో ఎయిర్ టెల్ ఈ నిర్ణయం తీసుకుంది.

నిర్దిష్ట వ్యాలిడిటీ అవసరం లేకుండా తన కస్లమర్లకు గతంలో 100 జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ ను జియో ఆఫర్ చేసింది. ఇటీవల ఆ ఆఫర్ ను సవరించి, 100 జీబీ కి బదులుగా 50 జీబీ మాత్రమే ఇస్తున్నట్లు వెల్లడించింది. జియో మాదిరిగా కాకుండా, ఎయిర్ టెల్ 100 జీబీ గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ ను ఆరు నెలల పాటు ఉచితంగా అందిస్తోంది.

ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్, వై-ఫై వినియోగదారులు తమ ఫోటోలు, జీమెయిల్ డేటా, వాట్సాప్ డేటా మొదలైన వాటిని నిల్వ చేయడాన...