భారతదేశం, ఆగస్టు 20 -- టెలికాం పరిశ్రమలో మరో షాక్ తగిలింది. అతిపెద్ద కస్టమర్ బేస్ ఉన్న ఎయిర్‌టెల్ తన వినియోగదారలకు షాక్ ఇచ్చింది. ఇకపై చౌక ప్లాన్లతో రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉండదు. జియో తరువాత, ఇప్పుడు ఎయిర్‌టెల్ కూడా తన సరసమైన రూ .249 ప్రీపెయిడ్ ప్లాన్‌‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

'ప్రొడక్ట్ క్లోజింగ్ టునైట్' అనే ట్యాగ్‌తో కంపెనీ వెబ్‌సైట్‌లో ఆగస్టు 19న చూపించారు. ఈ ప్లాన్ 20 ఆగస్టు 2025 రాత్రి 12 గంటల తర్వాత అందుబాటులో లేదు. చౌక ఎయిర్‌టెల్ ప్లాన్ తక్కువ బడ్జెట్‌లో డేటా, కాలింగ్ ప్రయోజనాన్ని కోరుకునే కస్టమర్లకు బాగా ప్రాచుర్యం పొందింది. కంపెనీ ఈ ప్రీపెయిడ్ ప్యాక్ 24 రోజుల వాలిడిటీని ఇచ్చింది. ఇందులో రోజుకు 1 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 100 ఎస్ఎంఎస్ సౌకర్యం ఉన్నాయి. ఇది తక్కువ ఆదాయం ఉన్న వినియోగదారులకు బాగుండేది. ఇప్పుడు 1జీ...