భారతదేశం, ఏప్రిల్ 22 -- ేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరగడంతో ఓలా ఎలక్ట్రిక్ వంటి కంపెనీలు వేగంగా దూసుకెళ్తున్నాయి. కానీ ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్య ఓలా ఎలక్ట్రిక్‌కు పెద్ద దెబ్బే తగిలింది. లైసెన్స్ లేకుండా నడుస్తున్న ఓలా ఎలక్ట్రిక్‌కు చెందిన షోరూమ్‌వను మహారాష్ట్ర రవాణా శాఖ స్వాధీనం చేసుకుంది.

107 షోరూంలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు సీఎన్బీటీ18 నివేదిక వెల్లడించింది. ఈ మేరకు నోటీసులు పంపారు. ఇందులో చాలా వరకూ మూసివేశారు. 214 ఎలక్ట్రిక్ స్కూటర్లను సీజ్ చేశారు. భారతదేశంలో టెస్ట్ డ్రైవ్ కోసం ఏదైనా వాహనాన్ని విక్రయించడానికి లేదా చూపించడానికి తప్పనిసరి అయిన అవసరమైన ట్రేడ్ సర్టిఫికేట్ ఈ డీలర్‌షిప్‌లలో లేనందున ఈ చర్య తీసుకున్నారు.

ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ప్రభుత్వ అనుమతి. ఇది ఏదైనా షోరూమ్ వాహనాలను విక్రయించడానికి, పరీ...