భారతదేశం, నవంబర్ 3 -- కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ.. ఇప్పుడు హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్‌. భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్రలో తన పేరును లిఖించింది. సుదీర్ఘ కలను సాకారం చేసింది. తొలిసారి మహిళల ప్రపంచకప్ ను ముద్దాడింది. ఆదివారం (నవంబర్ 2) అర్ధరాత్రి ముగిసిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఇండియా గెలిచింది.

భారత మహిళల జట్టు అద్భుతం చేసింది. తొలిసారి ఓ ప్రపంచకప్ సొంతం చేసుకుంది. టీ20ల్లో అయినా వన్డేల్లో అయినా ఇండియా వుమెన్స్ టీమ్ కు ఇదే ఫస్ట్ వరల్డ్ కప్. ఈ ఫైనల్ హీరో షఫాలీ వర్మ. బ్యాటింగ్ లో 87 పరుగులు చేయడంతో పాటు, బౌలింగ్ లో రెండు కీలక వికెట్లు పడగొట్టింది. దీంతో ఫైనల్లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచింది. మొహిందర్ అమర్ నాథ్, ఇర్ఫాన్ పఠాన్, ధోని, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాల సరసన చేరింది.

నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో ఛేజ...